1

జీవితం మైదానం లాంటిది. 
అందులో నిరాశ అనే ఇసుక పడితే ఎడారి అవుతుంది. 
సంతోషం అనే చిరుజల్లు పడితే నందనవనం అవుతుంది.




స్పందించ వలసిన సమయం ఒక నిమిషం కాలం అయితే అది కోల్పోయినపుడు చెల్లించాల్సిన మొత్తం ఒక జీవిత కాలం.


తెలిసి తెలిసి గంజాయి మొక్కకు తడి చేయి విదిలించుట కూడా తప్పే. 


మనసంటే బలహీనతలకు లొంగిపోవడమే. బలహీనతకు లొంగ లేదంటే మనసు లేనట్టే. 


ఉప్పెన వచ్చిందని ఊరు బాధ పడిపోదు. ఎద్దడి వచ్చిందని ఏరు బాధపడదు. రెండింటికి మల్లి మంచి రోజులు వస్తాయని ఆశ వాటిని కల కాలం ఉండేలా చేస్తుంది.


ఎంతో దూరం వెళ్ళాల్సి వస్తే ఎంత దూరం వెల్లగలమో తెలుసుకోవడమే అసలైన ఎత్తుగడ. 


ఇద్దరు నీతో విరోధం పెట్టుకుంటే ఒకడితో సంధి చేసుకుని రెండో వాడితో విరోధం కొనసాగించాలి..... చాణక్యుడు. 


నీ కారెక్టర్ గురించి చెప్పాలంటే నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దర్ని నాకు పరిచయం చెయ్యి. నీ  కారెక్టర్ గురించి మొత్తం చెప్తాను ...... సోక్రటిసు.


వ్యాధి శేషం, అగ్ని శేషం, శత్రు శేషం మరియు రుణ శేషం తిరిగి మల్లి పెరుగుతాయి. వాటిని ఎప్పుడు నిశ్శేషం చేయాలి. 


ప్రతికూల అభిప్రాయాన్ని అలక్ష్యం చేయడం కన్నా పరిశీలించడం అవసరం. లేకపోతే అది మరింత శక్తివంతం  అవుతుంది. 


వేకువనే లేచుట, యుద్ధమునందు వెనకడుగు వేయకుండుట, జయమునొంది అనుభవించుట కోడి నుండి మనం నేర్చుకోవలిసినవి.


లంకలో పుట్టిన వాళ్ళందరు రాక్షసులే.